Friday, November 23, 2012

God is so great

దైవం చాల గొప్ప వాడు  :

దైవం నిజముగా చాలా గొప్ప వాడు. తను  సృష్టించిన ప్రకృతిలో ప్రతి ప్రాణి అవసరాలు తీర్చడంలో భగవంతుడు ఎల్లప్పుడూ ముందుంటాడు, ముందున్నాడు. ఇది జగమెరిగిన సత్యం. ప్రకృతి రూపంలో చరాచర  జీవరాశిని  రక్షిస్తూ, సదా ఎవ్విధమయిన లోటు లేకుండా చూసుకుంటున్న భగవంతుడు ప్రకృతిలో  భాగమైన  నన్ను కూడా అదే  విధముగా కాపాడక మానడు. కాని నాకు అతనిపై   అకుంటిత విశ్వాసము   ఉన్నదా లేదా అన్నదే   ప్రశ్న ? 


సృష్టిలో ఉన్న ప్రతి జీవి భగవంతుడు నిర్దేశించిన మార్గములోనే ప్రయాణం చేస్తుంది. ఒక్క మనిషి తప్ప. మరి మనిషి అంటే మానవత్వం ఉన్న జీవి


మనిషికి ముఖ్యంగా రెండు లక్షణాలు ఉండాలంటారు. ఆ రెండు లక్షణాలు ఉంటేనే మనిషిగా గుర్తించాలి అని పెద్దలు చెపుతారు. అవి 


01. అహింస    :  
ప్రకృతిలో ఏ జీవి అహింసను గూర్చి మాట్లాడటం కానీ ఆచరించడం కానీ చేయలేదు. సాదు జంతువులైన ఆవు లాంటివి కూడా ఎదో ఒక సందర్భంలో హింస కు పాల్పడతాయి. ఆత్మ రక్షణ విషయములో తనను  తాను రక్షించుకునేందుకు తప్పక ఇతరులతో అవి పోట్లడతాయి. కానీ మనిషన్నవాడు అలాంటి సందర్భంలో కూడా ఇతరులకు హాని  తలపెట్టకుండా  ఉండి నిగ్రహించుకోగాలిగితే అదే అహింస అని అంటారు పెద్దలు.  ఇది మానవునికి, మనీషిగా ఎదగడానికి ప్రధమ లక్షణమైతే ఇక రెండవది 

02.   సేవ   :  
ప్రతిఫలం ఆశించకుండా ఇతరులకు చేసినదే సేవ. ప్రకృతిలో ప్రతి ప్రాణి తన పని తను చేస్తూనే ఉన్నది. అంటే కాకుండా మనం చప్పి పని చేయిన్చుకుంటాము. (ప్రతిఫలం ఇచేది లేదు.) కాని  ఏది ఆశించకుండా, ప్రతిఫలాని కోరకుండా ఇతరులకు సహాయ పడగలిగినది ఒక్క మానవుడు మాత్రమే.

పై రెండు లక్షణాలు అలవాటు కాకపోతే మిగిలిన జంతువులకు మానవునికి తేడా ఏమి లేదు అని ధర్మం. 


మహాత్ములు కూడా స్వార్ధపరులే. వారి కార్యాల వెనుక వ్యక్తిగత స్వార్థం కాక సమిష్టి స్వార్థం ఉంటుంది.  మంది  కొరకు వారి  సార్వస్వాన్ని అర్పణ చేసి  మహా  కార్యాలను సాధిస్తారు. అంటే కాని  తుచ్చామిన, వ్యక్తిగత విషయాల కొరకు వారు  జీవితాన్ని, సమయాన్ని, డబ్బును వారు వెచ్చించి వృధా చేసిన దాఖలాలు చరిత్రలో లేవు. 


అలా    "తన  కొరకు   తను"   అనుకుని  పనిచేసిన వారి జీవితాలను

ఈ జాతి ఏనాడు  గౌరవించినది లేదు.

ఎవరైతే పరులకొరకు బ్రతికారో వారి జీవిత చరిత్రలే దేశ చరిత్రగా లిఖించ బడుతుంది. ఈ భూమి ఉన్నంత కాలం వాటినే ప్రజలు స్మరిస్తారు. కీర్తిస్తారు. తరువాతి తరాలవారికి కధలు కధలుగా చెపుతారు. పాటలుగా పాడుకుంటారు


ఎంతో ఉదాత్తమైన జీవితాని ఇచ్చి, ప్రకృతి హితం కొరకు జీవించేలా భగవంతుడు  మనిషిని, తనకు ప్రతిరూపంగా ఈ భూమిపైకి పంపాడు. కాని తన స్వార్ధానికి  వక్తి తనే బలి అవుతున్నాడు


అయినా    భగవంతుడు ఎంతో ఉదారుడు. ప్రతి జీవికి ప్రతి అవసరాన్ని పూర్తి చేస్తూనే ఉన్నాడు. రాజైన పేదైనా, డబ్బున్నా లేకున్నా, గొప్పవాడైనా సామాన్యుడైనా, అందరి కొరకు  పంచభూతాలను సమానంగా సృష్టించాడు. అందరికి ఒకేలా అందించాడు. వాటి పంపకాలలో మరల మనం తన్ను కుంటున్నాము తప్ప అది భగవంతుని తప్పిదం కాదు.


అందుకే దైవం చాలా గొప్పవాడు. కాదంటారా ? కాదనగల ధైర్యం ఎవరికైనా ఉన్నదా ?


ఇవన్నీ నేను నేర్చుకున్న జీవిత పాఠాలు. వీటన్నింటిని అమలు చేసే ప్రయత్నం ఆరంభించాను


అందరి సహకారం కూడా అవసరమే..................

   

 

No comments:

Post a Comment