గాంధీ గ్రామం :
చోడవరం మండల కేంద్రంగా, మండలంలో 32 పంచాయతీలు ఉన్నాయి. వాటిలో ఒకటి గాంధీ గ్రామం పంచాయతి. పంచాయతి ప్రస్తుత పరిస్తితిని గూర్చి చెప్పే సాహసమైతే చేయను గాని ఈ పంచాయాతికి అలా ఎందుకు నామకరణం చేసారో తప్పక తెలుసుకోవాలి.
1930 లలో మహాత్ముడు ఈ గడ్డపై అడుగి పెట్టిన కారణంగా ఈ గ్రామానికి గాంధీ గ్రామం అని పెద్దలు ఆ రోజున నామకరణం చేసారు. మహాత్ముడు పాదయాత్ర చేసుకొంటూ ఈ గ్రామము మీదుగా చోడవరం చేరుకొని ప్రస్తుతం ప్రేమ సమాజముగా పిలువబడుతున్న స్తలము నందు బహిరంగ సభ జరిగిందని పూర్వీకులు చెప్పగా విని సంతోషపడ్డాను. సంతోష దాయకమే కదా. గాంధీ మహాత్ముడు నడచిన నేలపై నడిచే అవకాసం, మనకు అందున ముఖ్యంగా నాలాంటి సామాన్యునికి లభించడం చాలా ఆనందాన్ని మరియు సంతోషాన్ని ఇచ్చింది. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఎంతోమంది మహాత్ములు ఈ దేశపు గడ్డపై జన్మించి, ఆదర్శ జీవితాన్ని గడపి, జీవించి చూపించారు. ప్రపంచానికి మార్గదర్శనం చేసారు. ఎంతో మందిని ప్రభావితం చేసారు. అల్లాంటి మట్టిలో పుట్టిన మన అదృష్టాన్ని కాదనగాలవారు ఎవరు ? 1993 లో కట్టుకున్న ఇల్లు, అది కూడా గాంధీ గ్రామంలో కావడం వలన, 1997 నుండి, నేను నా సైట్ ఇంజినీర్ ఉద్యోగాన్ని వదలి ముంబై నుండి గాంధీ గ్రామం లో ఉండడం ఆరంభించిన నాటి నుండి నాకు ఎదురైనా అనుభవాలను క్రితంలో పంచుకున్నాను. పేరు మహాత్మునిది. కాని జరుగుతున్న పనులన్నీ అందుకు వ్యతిరేకంగా ఉన్నందున ఒకింత బాధ కలిగి తిరగబడాలని అనిపించినా అలా చెయ్యలేక పోయాను. ఎందుకంటే దేశంలో ఉన్నావారిలో చాలామంది గాంధీ ఫోటోలు వెనుక వేలాడేసుకుని గాంధికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు ఈ సత్యాన్ని కాదనగలమా ? కళ్ళకు ఎదురుగా ప్రతి నిత్యం జరుగుతున్నది అదే కదా ? ప్రజలది, అందునా గాంధీ గ్రామం ప్రజలది అసలు తప్పు కనే కాదు వారు కూడా అతీతులు కారు. నా గ్రామం కూడా ఈ దేశంలో ఒక భాగమే కదా. ప్రజల మంచితనాన్ని సొమ్ముచేసుకునే నాయకులు ప్రతి చోటా ఉండనే ఉన్నారు. ఇక్కడ కూడా ఉంటారు కదా.
"యదా రాజా తదా ప్రజా" అంటున్నది ధర్మం. దేశంలో గల నాయకుల ఆదర్సమే ఇక్కడ కూడా నడుస్తున్నది అనడంలో ఎటువంటి సంకోచము లేదు.
సమస్య ఎదురుగా కనిపిస్తున్నది. పరిష్కారం కూడా ఒకటే. స్వామీ వివేకానందుల వారిని కోతులు తరుముతున్న కధ గుర్తుకు వచ్చింది.
3300 మంది ఓటరులు, 7500 జనాభా కలిగిన గాంధి గ్రామంలో మార్పుకు పునాది వెయ్యాలి అని అనిపించింది. అందుకే నాదైన గాంధీ గ్రామంలో 10 మంది యువకులతో సమావేశం ద్వారా పని ఆరంభం చెయ్యడం జరిగింది.
గాంధీ ఆస్య సాధనకు కృషి ఆరంభించామనే చెప్పాలి.
గాంధీ గ్రామం పంచాయతి లో 01.గాంధీ నగర్ 02.సిటిజన్ కాలనీ 03. లక్ష్మి నగర్, 04. ఎల్,ఐ.సి. కాలని 05.విద్యా నగర్ 06.శాంతి నగర్. ఇలా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి.
చోడవరం మండల కేంద్రంగా, మండలంలో 32 పంచాయతీలు ఉన్నాయి. వాటిలో ఒకటి గాంధీ గ్రామం పంచాయతి. పంచాయతి ప్రస్తుత పరిస్తితిని గూర్చి చెప్పే సాహసమైతే చేయను గాని ఈ పంచాయాతికి అలా ఎందుకు నామకరణం చేసారో తప్పక తెలుసుకోవాలి.

"యదా రాజా తదా ప్రజా" అంటున్నది ధర్మం. దేశంలో గల నాయకుల ఆదర్సమే ఇక్కడ కూడా నడుస్తున్నది అనడంలో ఎటువంటి సంకోచము లేదు.
సమస్య ఎదురుగా కనిపిస్తున్నది. పరిష్కారం కూడా ఒకటే. స్వామీ వివేకానందుల వారిని కోతులు తరుముతున్న కధ గుర్తుకు వచ్చింది.
3300 మంది ఓటరులు, 7500 జనాభా కలిగిన గాంధి గ్రామంలో మార్పుకు పునాది వెయ్యాలి అని అనిపించింది. అందుకే నాదైన గాంధీ గ్రామంలో 10 మంది యువకులతో సమావేశం ద్వారా పని ఆరంభం చెయ్యడం జరిగింది.
గాంధీ ఆస్య సాధనకు కృషి ఆరంభించామనే చెప్పాలి.
గాంధీ గ్రామం పంచాయతి లో 01.గాంధీ నగర్ 02.సిటిజన్ కాలనీ 03. లక్ష్మి నగర్, 04. ఎల్,ఐ.సి. కాలని 05.విద్యా నగర్ 06.శాంతి నగర్. ఇలా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి.
గాంధీ గ్రామం, చోడవరమునకు అనగా మండల కేంద్రం కు 0.5 కిలో మీటర్లు దూరం మాత్రమె ఉంటుంది. అందువలన చోడవరం యొక్క పూర్తి ప్రభావం ఈ గ్రామం పై సదా ఉండటం సహజం. ఎన్నో సంవత్సరాలుగా మిత్రులుగా కలిసున్నపుడు ఒకరి ప్రభావం మరియోకరిపై ఉండడమనేది సహజమే కదా ? సామాజికముగా, భౌగోళికముగా, సాంఘికముగా, ఆర్ధికముగానే కాకుండా ఎన్నో రకాలుగా కలసిపొయిన ఎవ్విధముగానూ విడదీయడం కష్టమే. కాని సంకల్పం మాట. మార్పు సాధారణం గా చేకూరదు అనేది సత్యం. ఏ పనీ కష్టం కాదు కాని శ్రమిస్తే ప్రతి పని కూడా కాస్త సాధ్యమే. ఒక్కటే నమ్మకం, నా దైవం ఖచ్చితముగా సహకరిస్తాడని, ఎందుకంటే చేస్తున్నది, చెయ్యాలని అనుకున్నది మంచిపని కాని చెడు మాత్రం కాదు అనే దృఢమైన నమ్మకం మనసులో ఉన్నది. తదుపరి దైవం సహకారం మరియు కరుణ. ఆపైవాని నిర్ణయం.
No comments:
Post a Comment