Friday, November 23, 2012

సంకల్పం   :

చోడవరం లో భాగంగా నే మరికొన్ని పంచాయతీలు కూడా కలసి ఉన్నాయి.  అవి 1. గాంధి గ్రామం, 2.నరసయ్యపేట. గాంధి గ్రామంలో ఉంటున్న నేను పంచాయతీకి బాధ్యులైనవారిని వీధి లైటు వేయించమని కోరడం జరిగింది. అందు నిమిత్తము నన్ను రూ. 800 లంచంగా ఇవ్వాలన్నారు, సదరు వ్యక్తీ. ఇంటి పన్ను కడుతున్న మేము అదనంగా వీధి లైటు  నిమిత్తము ఎందుకు అంత సొమ్ము చెల్లించాలో అర్థం కాలేదు. సరి కదా  మరియొక మారు వీధిలో  మంచి నీళ్ళ కుళాయిని  గూర్చి,  కావాలని  అడిగినందుకు గాను రూ.1500 లంచం గా ఇమ్మనడం జరిగింది.  ఒకింత ఆవేదన కలిగినా, పరిష్కారాన్ని వెదకాలని అనిపించింది. తత్ ఫలితమే ప్రస్తుత పరిణామాలకు కారణము.

పలు మారులు పలువురు వ్యక్తులతో చర్చించిన తరువాత వారిలో కూడా అదే ఆవేదన, అదే రకమైన ఆలోచన ఉండడం గమనిచాను. సదరు ఆలోచనలకూ రూపం ఇవ్వాలని సకల్పం చేసుకున్నాను. అందరు ఎవరి పనులలో వారు ఉన్నాసహకారం  అందుతుందని మాత్రం  రూడిగా బోధపడింది.


పెద్దలతో ఆరంభించాలంటే ఒకింత కష్టమే, వారితో మనం పనిచెయ్యాలి తప్పితే వారు మనవైపుకు రావడం ఒకింత కష్టమే. నాతో పనిచేస్తున్న పిల్లలతో పని ఆరంభించాలని నిర్ణయించుకున్నాను.


No comments:

Post a Comment