జీవితం చాలా చిన్నది కదా. కాని మనిషి మాత్రం ఈ విషయాన్ని ప్రక్కకు నెట్టి మిగతా అన్ని విషయాలను గూర్చి ఆలోచిస్తాడు, పని చేస్తాడు. చాలా విచిత్రమైన విషయం కదా.....
ఎదురుగా జరుగుతున్న వాటిని కూడా పట్టించుకోవడానికి తీరిక లేనట్లుగా ప్రవర్తిస్తాడు ప్రతివాడు. 65 సంవత్సరాల స్వాతంత్ర్య భారత దేశంలో నా నా గ్రామం కొరకు నేను ఏదేనా చెయ్యాలి అని అలోచిస్తిన్న వారి సంఖ్య అతి తక్కువనే చెప్పక తప్పదు. " నేను తప్పటడుగులు వేస్తున్నప్పుడు, నన్ను పడిపోకుండా నాకు రక్షణ కవచంలా కాపాడినది ఈ గ్రామమే కదా, నా ప్రతి అవసరమును తీర్చినది, ప్రేమను ఆప్యాయతను పంచినది అదే గ్రామము. నా గ్రామమునకు నా ఋణం తీర్చుకోవాలి " అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తే దేశంలో గ్రామాలన్నీ ఈ పాటికి చాలావరకు అందంగా తయారై ఉండేవి.
పొందిన మేలును మరచిపోయే వాడు ద్రోహి గా మిగిలిపోతాడు. అలాంటి ద్రోహుల సంఖ్య నాదైన దేశంలో ఎక్కువ అని చెప్పక తప్పదు. ఇలా చెప్పడం తప్పేమో నాకు తెలియదు , కాని చెప్పక తప్పటం లేదు.
ఎవరైతే వారి గ్రామాల కొరకు, వాటి బాగు కొరకు దీక్షగా పని చేసారో వారే నిజమైన హీరోలు. అన్న హజారే లాంటి వారు, వారి పనిని సొంత ఇంటి నుండే ప్రారంభించారు. కావలసినంత తిని, అవసరం తీరిన తరువాత
తల్లిని నడి రోడ్డున వదిలి వెలుతున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. రాముడంతటి వాడు
"ఆపి స్వర్ణ మయి లంకా నమే లక్ష్మణ రోచతే
జనని జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి " అన్నాడు.
( బంగారు లంక ఎంత అందముగా ఉన్నా నాకు ఆనందాని కలిగించలేదు. జనని, జన్మ భూమి స్వర్గం కన్నా మిన్న.)
కాని ప్రస్తుత సమాజంలో వక్తి " నా చిన్ని పొట్టకు శ్రీరామ రక్ష" అనుకుని బ్రతికేస్తున్నాడు.
చదివిన చదువుకు సార్థకత చేకూర్చాలని భావించి పని చేయ గలిగితే అదే నిజమైన జీవితం. మంచి వారి సహచర్యం వలన, పరమ గురువుల ఆశీర్వాద ఫలితం గా నాలో కూడా ఎదో చెయ్యాలనే తపన కలిగింది. అంతే కాకుండా సమాజం కూడా మార్పు కావాలని కోరుకుంటున్నది. అందుకే ముందుగ నాదైన గాంధీ గ్రామంలో యువకులను కలసి నా భావాలు పంచుకున్నాను. వారి సలహాలు కూడా తీసుకున్నాను. కాని నా సంకల్పం మాత్రం వారికి తెలియనివ్వలేదు. చెప్పలేదు.

No comments:
Post a Comment