Tuesday, November 27, 2012

పని ఆరంభం : 

ఒక సాయంత్రం దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకుని అందరమూ కలసి కూర్చున్నాము. పని విషయమై చాలాసేపు చర్చ జరిగింది. అనంతరం ఒక కొత్త విషయాన్ని ప్రస్తావన చెయ్యడం ఆరంభిచాము. మరి కొన్ని విషయాలను చర్చించాము. వాటిలో సేవ ను గూర్చి అందరం కలసి ఆలోచిస్తూ " కలసి బ్రతుకుతున్నాము, కాని కొంత సమయాన్ని మంచి విషయాలకు వెచ్చించాలని" యోజన చేసాము. మనిషిలో ఆదర్శం నింపడం కొరకు ఎదురుగా ఆవును సృష్టించాడు. మానవుడు ఎలా బ్రతకాలో తెలియ చెప్పడం కొరకు ఎన్నో ఆదర్శాలను భగవంతుడు కళ్ళకు ఎదురుగా ఉంచాడు. పెద్దలు చెప్పిన ఆవు కథ చెప్పుకున్నాము. పూర్వకాలంలో తాతగారు, మనవలు కలసి బ్రతికే అవకాసం ఉండేది. ప్రస్తుత కాలంలో ఈ అవకాసం లేదు. ఎందుకంటే పిల్లలు తమ తల్లి తండ్రులతో కలసి ఉండాలని అనుకోవటం లేదు. "బ్రతుకు వేటలో" అని వంక పెట్టి కన్నవారిని వదలి వారికి దూరంగా బ్రతకాలని అనుకోవడంలో అంతర్యాన్ని తెలుసుకోవాలి. మన కథలో ఒక తాత మనుమడు కలసి కథలు చెప్పుకుంటున్నారు. ఇంతలో ఒక ఆవు (దేశీయ) బయట "అంబా అంబా" అని ఆత్రుతతో అరుస్తూ అటువైపుగా వచ్చింది. తాత మనుమలకి కలిగిన అంతరాయానికి ఒకింత చింతించి తాత గారు మనుమనితో " అంతరాయం కలిగిస్తున్న ఆవును కొట్టి తగిలిరా" అని మనుమనికి అతని చేతిలో ఉన్న కర్రను ఇచ్చి పంపాడు. చేతి కర్ర తీసుకుని మనుమడు ఆవును చేరి కొట్టబోగా ................ (మన కథలో ఆవు మాట్లాడుతుంది........... ఎలా ? అని దయవుంచి నన్ను ప్రస్నిన్చవద్దని నా విన్నపము.) కొట్టాలని వచ్చిన బాలున్ని చూసి 

ఆవు .. ఎందుకు కొడుతున్నావు ? 
బాలుడు .. మా కథకు అంతరాయం కలుగాచేస్తున్నావు, అందుకు. 
ఆవు .. సరే, నా ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా ? 
బాలుడు .. సరే అడుగు. 
ఆవు .. ఎంత చదువుతున్నావు 
బాలుడు .. ఏడవ తరగతి 
ఆవు .. తరువాత ఏం చేస్తావు ? 
బాలుడు .. మెల్లగా పదవ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను 
ఆవు .. తరువాత ? 
బాలుడు .. ఇంటర్ 
ఆవు .. తరువాత ? 
బాలుడు .. ఇంగానీరింగ్ కాని డాక్టర్ కాని పూర్తి చేస్తాను. 
ఆవు .. తరువాత ? 
బాలుడు .. మంచి ఉద్యోగం సంపాదిస్తాను 
ఆవు .. తరువాత ? 
బాలుడు .. బాగా డబ్బులు సంపాదిస్తాను. పెద్ద ఇల్లు కట్టుకుంటాను, పెద్ద     కారు కొంటాను. 
ఆవు .. తరువాత ? 
బాలుడు .. మంచి, అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను 
ఆవు .. తరువాత ? 
బాలుడు .. ఇంకేంటి, పిల్లలకు తండ్రిని అవుతాను. 
ఆవు .. తరువాత ? 
బాలుడు .. వారిని పెద్ద చేసి, చదివించి, వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్లు చేస్తాను. 
ఆవు .. తరువాత ? 
బాలుడు .. వారికి పెళ్ళిళ్ళు చేస్తాను 
ఆవు .. తరువాత ? 
బాలుడు .. వారికి పిల్లలు పుడతారు. నేను పదవీ విరమణ చేస్తాను. ఆ పిల్లలతో ఆడుకుంటాను. కొంతకాలానికి నేను ముసలి అయిపోతాను. 
ఆవు .. తరువాత ? 
బాలుడు .. ఇంకేముంది ? ఒక రోజు చచ్చిపోతాను. 
ఆవు .. ఓస్ ...... ఇంతేనా ????????????? 

(మన వాడికి కోపం వచ్చింది. వెంటనే మనవాడు ఉద్రేకంగా.....) 

బాలుడు ..  ఇంతకి నువ్వు  ఏం చేస్తావు ? (ఎదురు  ప్రశ్న )
ఆవు    ... నేను ఈ   సమాజానికి  పనికిరాని గడ్డి  తింటాను.
బాలుడు .. (చిన్నగా నవ్వుతూ) తరువాత ?
ఆవు  .. ఈ  సమాజం  దృడంగా, బలంగా, శక్తివంతంగా ఉండాలి. అందుకు పాలు  ఇస్తాను.
బాలుడు .. తరువాత  ?
ఆవు  ..  ఈ సమాజం  అందంగా, ఆరోగ్యవంతంగా  ఉండాలి. అందుకు వెన్న, మీగడ  ఇస్తాను.
బాలుడు .. తరువాత ?
ఆవు  .. ఈ సమాజం గ్యానవంతం గా ఉండాలని నెయ్య ఇస్తాను. 
బాలుడు .. తరువాత ?
ఆవు  ... నేను కుడా  పిల్లలను ఇస్తాను. అవి ఆడవైతే నేను చేసిన పనినే జీవితాంతం అవి   చేస్తూనే ఉంటాయి. మగవైతే రకరకాల బరువులు  లాగడానికి, వ్యసాయపు  పనులలోను  ఉపయోగ పడుతున్నది. 
బాలుడు .. తరువాత ?
ఆవు ... పేడతో  చాలా  గ్రామాలలో కరంటు తయారు చేసుకుంటున్నారు. పంచగవ్యములు  పలు రకముల వ్యాధులకు ఔశధములుగా ఉపయోగపడుతున్నాయి
బాలుడు .. తరువాత ?
ఆవు .. నేను కూడా చనిపోతాను. కాని నీ కాలుకు చెప్పులు వేసుకున్నావు కదా. అవి నా తోలుతో తయారు చేసినవి. నా కొమ్ములతో పిల్లలు ఆడుకొనే బొమ్మలు తయారు చేస్తారు నువ్వు వాడుతున్న పంచదార నా ఎముకల గుండతో శుద్ధి చేస్తారు. నేను చనిపోయిన తరువాత నన్ను ఎరువుగా కుడా వాడుకోవచ్చు

ఇన్ని ఉపయోగాలున్న ఆవును  భారతీయులు ఆరాధ్య దైవంగా పూజ చేస్తారు.  మరి మనిషి సమాజహితం కొరకు చేస్తున్నది ? తన స్వార్ధం కొరకు ప్రపంచాన్ని గుప్పిట పట్టాలని చూస్తున్నాడు . 

మరి మనవాళ్ళు "మనిషివా పసువువా ?" అని ప్రశ్నిస్తూ వుంటారు. ఏమని ప్రస్నిన్చాలంటారు ?  " పశువువా లేక మనిషివిరా ?" అని కదా.......

ఇది విన్న తరువాత చాలా మంది మిత్రులు అలోచించి ఏదయినా చెయ్యాలని సంకల్పం చేసారు.
ఈ విధంగా పని ఆరంభం కావడం చాలా ఆనందించ వలసిన విషయం కదా ....  



Saturday, November 24, 2012

Gandhi Gramam

గాంధీ గ్రామం  :

చోడవరం మండల కేంద్రంగా, మండలంలో 32 పంచాయతీలు ఉన్నాయి. వాటిలో ఒకటి గాంధీ గ్రామం పంచాయతి. పంచాయతి ప్రస్తుత పరిస్తితిని గూర్చి చెప్పే సాహసమైతే చేయను గాని ఈ పంచాయాతికి అలా ఎందుకు నామకరణం చేసారో తప్పక తెలుసుకోవాలి

1930 లలో మహాత్ముడు ఈ గడ్డపై అడుగి పెట్టిన కారణంగా ఈ గ్రామానికి గాంధీ గ్రామం అని పెద్దలు ఆ రోజున నామకరణం చేసారు. మహాత్ముడు పాదయాత్ర చేసుకొంటూ ఈ గ్రామము మీదుగా చోడవరం చేరుకొని ప్రస్తుతం ప్రేమ సమాజముగా పిలువబడుతున్న స్తలము నందు బహిరంగ సభ జరిగిందని పూర్వీకులు చెప్పగా విని  సంతోషపడ్డాను. సంతోష దాయకమే కదా. గాంధీ మహాత్ముడు  నడచిన నేలపై  నడిచే అవకాసం, మనకు అందున ముఖ్యంగా నాలాంటి సామాన్యునికి లభించడం చాలా ఆనందాన్ని మరియు సంతోషాన్ని ఇచ్చింది. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే  ఎంతోమంది మహాత్ములు ఈ దేశపు గడ్డపై జన్మించి, ఆదర్శ జీవితాన్ని గడపి, జీవించి చూపించారు. ప్రపంచానికి మార్గదర్శనం చేసారు. ఎంతో మందిని  ప్రభావితం చేసారు. అల్లాంటి మట్టిలో పుట్టిన మన అదృష్టాన్ని కాదనగాలవారు ఎవరు ? 1993 లో కట్టుకున్న ఇల్లు, అది కూడా గాంధీ గ్రామంలో కావడం వలన, 1997 నుండి, నేను నా సైట్ ఇంజినీర్ ఉద్యోగాన్ని వదలి ముంబై నుండి గాంధీ గ్రామం లో ఉండడం ఆరంభించిన నాటి నుండి నాకు ఎదురైనా అనుభవాలను క్రితంలో పంచుకున్నాను. పేరు మహాత్మునిది. కాని జరుగుతున్న పనులన్నీ అందుకు వ్యతిరేకంగా ఉన్నందున ఒకింత బాధ కలిగి తిరగబడాలని  అనిపించినా అలా చెయ్యలేక పోయాను. ఎందుకంటే దేశంలో ఉన్నావారిలో చాలామంది గాంధీ ఫోటోలు వెనుక వేలాడేసుకుని గాంధికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు ఈ సత్యాన్ని కాదనగలమా ? కళ్ళకు ఎదురుగా ప్రతి నిత్యం జరుగుతున్నది అదే కదా ? ప్రజలది,  అందునా గాంధీ గ్రామం ప్రజలది అసలు తప్పు కనే కాదు వారు కూడా అతీతులు కారు. నా గ్రామం కూడా ఈ దేశంలో ఒక భాగమే కదా. ప్రజల మంచితనాన్ని సొమ్ముచేసుకునే నాయకులు ప్రతి చోటా ఉండనే ఉన్నారు. ఇక్కడ కూడా ఉంటారు కదా

"యదా రాజా తదా ప్రజా" అంటున్నది ధర్మం. దేశంలో గల నాయకుల ఆదర్సమే ఇక్కడ కూడా నడుస్తున్నది అనడంలో ఎటువంటి సంకోచము లేదు

సమస్య ఎదురుగా కనిపిస్తున్నది. పరిష్కారం కూడా ఒకటే. స్వామీ వివేకానందుల వారిని కోతులు తరుముతున్న కధ గుర్తుకు వచ్చింది.
3300 మంది ఓటరులు, 7500 జనాభా కలిగిన గాంధి  గ్రామంలో  మార్పుకు పునాది వెయ్యాలి అని అనిపించింది. అందుకే నాదైన గాంధీ గ్రామంలో 10 మంది యువకులతో సమావేశం ద్వారా పని ఆరంభం చెయ్యడం జరిగింది.
గాంధీ ఆస్య సాధనకు కృషి ఆరంభించామనే  చెప్పాలి. 

గాంధీ గ్రామం పంచాయతి లో 01.గాంధీ నగర్  02.సిటిజన్ కాలనీ  03. లక్ష్మి నగర్, 04. ఎల్,ఐ.సి. కాలని 05.విద్యా నగర్  06.శాంతి నగర్. ఇలా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి.

గాంధీ గ్రామం, చోడవరమునకు అనగా మండల కేంద్రం కు 0.5 కిలో మీటర్లు దూరం మాత్రమె ఉంటుంది. అందువలన చోడవరం యొక్క పూర్తి  ప్రభావం ఈ గ్రామం పై సదా ఉండటం సహజం. ఎన్నో సంవత్సరాలుగా మిత్రులుగా కలిసున్నపుడు  ఒకరి ప్రభావం మరియోకరిపై ఉండడమనేది సహజమే కదా ? సామాజికముగా, భౌగోళికముగా, సాంఘికముగా, ఆర్ధికముగానే  కాకుండా ఎన్నో రకాలుగా కలసిపొయిన ఎవ్విధముగానూ విడదీయడం  కష్టమే. కాని సంకల్పం మాట. మార్పు సాధారణం గా చేకూరదు అనేది సత్యం. ఏ పనీ కష్టం కాదు కాని శ్రమిస్తే ప్రతి పని కూడా కాస్త సాధ్యమే. ఒక్కటే నమ్మకం, నా దైవం ఖచ్చితముగా సహకరిస్తాడని, ఎందుకంటే చేస్తున్నది, చెయ్యాలని అనుకున్నది మంచిపని కాని చెడు మాత్రం కాదు అనే దృఢమైన  నమ్మకం మనసులో ఉన్నది. తదుపరి దైవం సహకారం మరియు కరుణ. ఆపైవాని నిర్ణయం. 

Friday, November 23, 2012

God is so great

దైవం చాల గొప్ప వాడు  :

దైవం నిజముగా చాలా గొప్ప వాడు. తను  సృష్టించిన ప్రకృతిలో ప్రతి ప్రాణి అవసరాలు తీర్చడంలో భగవంతుడు ఎల్లప్పుడూ ముందుంటాడు, ముందున్నాడు. ఇది జగమెరిగిన సత్యం. ప్రకృతి రూపంలో చరాచర  జీవరాశిని  రక్షిస్తూ, సదా ఎవ్విధమయిన లోటు లేకుండా చూసుకుంటున్న భగవంతుడు ప్రకృతిలో  భాగమైన  నన్ను కూడా అదే  విధముగా కాపాడక మానడు. కాని నాకు అతనిపై   అకుంటిత విశ్వాసము   ఉన్నదా లేదా అన్నదే   ప్రశ్న ? 


సృష్టిలో ఉన్న ప్రతి జీవి భగవంతుడు నిర్దేశించిన మార్గములోనే ప్రయాణం చేస్తుంది. ఒక్క మనిషి తప్ప. మరి మనిషి అంటే మానవత్వం ఉన్న జీవి


మనిషికి ముఖ్యంగా రెండు లక్షణాలు ఉండాలంటారు. ఆ రెండు లక్షణాలు ఉంటేనే మనిషిగా గుర్తించాలి అని పెద్దలు చెపుతారు. అవి 


01. అహింస    :  
ప్రకృతిలో ఏ జీవి అహింసను గూర్చి మాట్లాడటం కానీ ఆచరించడం కానీ చేయలేదు. సాదు జంతువులైన ఆవు లాంటివి కూడా ఎదో ఒక సందర్భంలో హింస కు పాల్పడతాయి. ఆత్మ రక్షణ విషయములో తనను  తాను రక్షించుకునేందుకు తప్పక ఇతరులతో అవి పోట్లడతాయి. కానీ మనిషన్నవాడు అలాంటి సందర్భంలో కూడా ఇతరులకు హాని  తలపెట్టకుండా  ఉండి నిగ్రహించుకోగాలిగితే అదే అహింస అని అంటారు పెద్దలు.  ఇది మానవునికి, మనీషిగా ఎదగడానికి ప్రధమ లక్షణమైతే ఇక రెండవది 

02.   సేవ   :  
ప్రతిఫలం ఆశించకుండా ఇతరులకు చేసినదే సేవ. ప్రకృతిలో ప్రతి ప్రాణి తన పని తను చేస్తూనే ఉన్నది. అంటే కాకుండా మనం చప్పి పని చేయిన్చుకుంటాము. (ప్రతిఫలం ఇచేది లేదు.) కాని  ఏది ఆశించకుండా, ప్రతిఫలాని కోరకుండా ఇతరులకు సహాయ పడగలిగినది ఒక్క మానవుడు మాత్రమే.

పై రెండు లక్షణాలు అలవాటు కాకపోతే మిగిలిన జంతువులకు మానవునికి తేడా ఏమి లేదు అని ధర్మం. 


మహాత్ములు కూడా స్వార్ధపరులే. వారి కార్యాల వెనుక వ్యక్తిగత స్వార్థం కాక సమిష్టి స్వార్థం ఉంటుంది.  మంది  కొరకు వారి  సార్వస్వాన్ని అర్పణ చేసి  మహా  కార్యాలను సాధిస్తారు. అంటే కాని  తుచ్చామిన, వ్యక్తిగత విషయాల కొరకు వారు  జీవితాన్ని, సమయాన్ని, డబ్బును వారు వెచ్చించి వృధా చేసిన దాఖలాలు చరిత్రలో లేవు. 


అలా    "తన  కొరకు   తను"   అనుకుని  పనిచేసిన వారి జీవితాలను

ఈ జాతి ఏనాడు  గౌరవించినది లేదు.

ఎవరైతే పరులకొరకు బ్రతికారో వారి జీవిత చరిత్రలే దేశ చరిత్రగా లిఖించ బడుతుంది. ఈ భూమి ఉన్నంత కాలం వాటినే ప్రజలు స్మరిస్తారు. కీర్తిస్తారు. తరువాతి తరాలవారికి కధలు కధలుగా చెపుతారు. పాటలుగా పాడుకుంటారు


ఎంతో ఉదాత్తమైన జీవితాని ఇచ్చి, ప్రకృతి హితం కొరకు జీవించేలా భగవంతుడు  మనిషిని, తనకు ప్రతిరూపంగా ఈ భూమిపైకి పంపాడు. కాని తన స్వార్ధానికి  వక్తి తనే బలి అవుతున్నాడు


అయినా    భగవంతుడు ఎంతో ఉదారుడు. ప్రతి జీవికి ప్రతి అవసరాన్ని పూర్తి చేస్తూనే ఉన్నాడు. రాజైన పేదైనా, డబ్బున్నా లేకున్నా, గొప్పవాడైనా సామాన్యుడైనా, అందరి కొరకు  పంచభూతాలను సమానంగా సృష్టించాడు. అందరికి ఒకేలా అందించాడు. వాటి పంపకాలలో మరల మనం తన్ను కుంటున్నాము తప్ప అది భగవంతుని తప్పిదం కాదు.


అందుకే దైవం చాలా గొప్పవాడు. కాదంటారా ? కాదనగల ధైర్యం ఎవరికైనా ఉన్నదా ?


ఇవన్నీ నేను నేర్చుకున్న జీవిత పాఠాలు. వీటన్నింటిని అమలు చేసే ప్రయత్నం ఆరంభించాను


అందరి సహకారం కూడా అవసరమే..................

   

 

జీవితం :

  జీవితం చాలా చిన్నది కదా. కాని  మనిషి  మాత్రం  ఈ విషయాన్ని ప్రక్కకు  నెట్టి మిగతా అన్ని విషయాలను  గూర్చి ఆలోచిస్తాడు, పని చేస్తాడు. చాలా విచిత్రమైన విషయం కదా.....

ఎదురుగా జరుగుతున్న వాటిని కూడా పట్టించుకోవడానికి తీరిక లేనట్లుగా ప్రవర్తిస్తాడు ప్రతివాడు. 65 సంవత్సరాల స్వాతంత్ర్య భారత  దేశంలో నా నా గ్రామం కొరకు  నేను ఏదేనా చెయ్యాలి అని అలోచిస్తిన్న వారి  సంఖ్య అతి తక్కువనే చెప్పక తప్పదు. " నేను  తప్పటడుగులు వేస్తున్నప్పుడు, నన్ను  పడిపోకుండా నాకు  రక్షణ  కవచంలా కాపాడినది ఈ గ్రామమే కదా, నా ప్రతి అవసరమును తీర్చినది, ప్రేమను  ఆప్యాయతను పంచినది అదే  గ్రామము. నా గ్రామమునకు నా ఋణం తీర్చుకోవాలి " అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తే దేశంలో గ్రామాలన్నీ ఈ పాటికి   చాలావరకు అందంగా తయారై ఉండేవి. 
పొందిన మేలును మరచిపోయే వాడు   ద్రోహి గా మిగిలిపోతాడు. అలాంటి ద్రోహుల సంఖ్య నాదైన దేశంలో  ఎక్కువ అని చెప్పక తప్పదు. ఇలా చెప్పడం తప్పేమో నాకు తెలియదు , కాని చెప్పక తప్పటం లేదు

ఎవరైతే వారి గ్రామాల కొరకు, వాటి బాగు కొరకు  దీక్షగా పని చేసారో వారే నిజమైన హీరోలు. అన్న హజారే లాంటి వారు, వారి పనిని సొంత ఇంటి నుండే  ప్రారంభించారు.  కావలసినంత  తిని, అవసరం తీరిన తరువాత 
తల్లిని నడి  రోడ్డున వదిలి వెలుతున్నవారి సంఖ్య రోజు  రోజుకు పెరుగుతున్నది. రాముడంతటి  వాడు 

 "ఆపి స్వర్ణ మయి లంకా నమే లక్ష్మణ రోచతే 
   జనని  జన్మ భూమిశ్చ స్వర్గాదపి  గరీయసి "   అన్నాడు.

( బంగారు లంక ఎంత అందముగా ఉన్నా నాకు ఆనందాని కలిగించలేదు. జనని, జన్మ భూమి స్వర్గం కన్నా మిన్న.)

కాని ప్రస్తుత సమాజంలో వక్తి " నా చిన్ని పొట్టకు శ్రీరామ రక్ష" అనుకుని బ్రతికేస్తున్నాడు.

 చదివిన  చదువుకు  సార్థకత  చేకూర్చాలని భావించి పని చేయ గలిగితే అదే నిజమైన జీవితం. మంచి వారి సహచర్యం  వలన, పరమ గురువుల ఆశీర్వాద  ఫలితం గా నాలో కూడా ఎదో చెయ్యాలనే తపన  కలిగింది.  అంతే కాకుండా సమాజం కూడా మార్పు కావాలని  కోరుకుంటున్నది. అందుకే ముందుగ నాదైన గాంధీ  గ్రామంలో యువకులను కలసి నా భావాలు పంచుకున్నాను. వారి సలహాలు కూడా తీసుకున్నాను. కాని నా సంకల్పం  మాత్రం  వారికి తెలియనివ్వలేదు. చెప్పలేదు.
సంకల్పం   :

చోడవరం లో భాగంగా నే మరికొన్ని పంచాయతీలు కూడా కలసి ఉన్నాయి.  అవి 1. గాంధి గ్రామం, 2.నరసయ్యపేట. గాంధి గ్రామంలో ఉంటున్న నేను పంచాయతీకి బాధ్యులైనవారిని వీధి లైటు వేయించమని కోరడం జరిగింది. అందు నిమిత్తము నన్ను రూ. 800 లంచంగా ఇవ్వాలన్నారు, సదరు వ్యక్తీ. ఇంటి పన్ను కడుతున్న మేము అదనంగా వీధి లైటు  నిమిత్తము ఎందుకు అంత సొమ్ము చెల్లించాలో అర్థం కాలేదు. సరి కదా  మరియొక మారు వీధిలో  మంచి నీళ్ళ కుళాయిని  గూర్చి,  కావాలని  అడిగినందుకు గాను రూ.1500 లంచం గా ఇమ్మనడం జరిగింది.  ఒకింత ఆవేదన కలిగినా, పరిష్కారాన్ని వెదకాలని అనిపించింది. తత్ ఫలితమే ప్రస్తుత పరిణామాలకు కారణము.

పలు మారులు పలువురు వ్యక్తులతో చర్చించిన తరువాత వారిలో కూడా అదే ఆవేదన, అదే రకమైన ఆలోచన ఉండడం గమనిచాను. సదరు ఆలోచనలకూ రూపం ఇవ్వాలని సకల్పం చేసుకున్నాను. అందరు ఎవరి పనులలో వారు ఉన్నాసహకారం  అందుతుందని మాత్రం  రూడిగా బోధపడింది.


పెద్దలతో ఆరంభించాలంటే ఒకింత కష్టమే, వారితో మనం పనిచెయ్యాలి తప్పితే వారు మనవైపుకు రావడం ఒకింత కష్టమే. నాతో పనిచేస్తున్న పిల్లలతో పని ఆరంభించాలని నిర్ణయించుకున్నాను.


Tuesday, November 20, 2012


 

ఆరంభం  :

చోడవరం ను గూర్చి కొంత మనం తెలుసుకోవాలి. క్రితంలో చోళుల రాజ్యం గా, వారికి కేంద్ర బిందువుగా ఉండేదని, చోడవరం పేరు చోళవరం నుండి రూపాంతరం చెంది చివరకు చోడవరం గా మార్పు చెందిందని పెద్దలు చెపుతారు.ఎంతో విశిష్టత  కలిగిన మాదైన ఈ గ్రామములో  చాల వింతలు విశేషాలు ఉన్నాయి. గ్రామాలు దేశానికి  పట్టుకొమ్మలు అని చెపుతున్నాము. కాని ప్రస్తుత పరిస్తితి అందుకు విరుద్ధముగా ఉన్నమాట వాస్తవము. ఒకింత బాధ కలిగించింది కూడా. అందుకే ఏదైనా చేస్తే బాగుంటుందని అనిపించి సంకల్పం చేయడం, పని ఆరంభించడం కూడా జరిగింది.

ఈ గ్రామంలో ఒక కోట కూడా ఉండేది. నేను ఈ గ్రామం చేరిన నాటికి ఆ కోట యొక్క  శిధిలాలు మాత్రమె ఉండేవి. అది నాకు తెలుసు. నేను చూసాను కుడా. ఆ శిధిలాలు ఈనాడు లేవు. ఖాలీ చేసి గృహనిర్మాణానికి అనుగుణం గా మార్చేసారు.  

వరసిద్ధి వినాయక స్వామీ ఈ గ్రామ ప్రతేకత. 350 సంవత్సరముల ఘన చరిత్ర కల్గిన స్వయంభూ వినాయక స్వామీ యొక్క  తొండము దేవాలయానికి  ఒక పర్లాంగు దూరంలో ఉన్న  బానయ్య కోనేరు అనే చెరువులోనికి ఉన్నది. ఒకసారి  తొండం ను గూర్చి తవ్వకం చేస్తే బానయ్య కోనేరు వరుకు ఉండడం చూసి  తిరిగి మూసేశారు. తురుష్కుల కాలంలో స్వామీ దేవాలయం దాడికి గురి కావడం మూలాన తిరిగి  దేవాలయాన్ని పునరుద్ధరించారు. కాణిపాకం వినాయకుని తరువాత  మా చోడవరం వరసిద్ధి వినాయక స్వామీ దేవాలయం అంత ప్రసిద్ధమైనది

అదే విధంగా స్వయంభూ గౌరీ పరమేశ్వర ఆలయం మరియొకటి చోడవరం ప్రత్యేకత. ఈ దేవాలయం కూడా 350 సంవత్సరాలకు పైచిలుక చరిత్ర కలిగియున్నది. వరసిద్ధి వినాయక స్వామివారి వలెనె ఈ స్వామికి కూడా తురుష్కుల  దండన తప్పలేదు. సదరు దండయాత్రలో స్వామీ యొక్క ఉపరితల లింగ భాగం పూర్తిగా చిద్రమైనది. కాని వరాలివ్వడం లో ఇరు దేవతలు  పోటి పడతారనే చెప్పక తప్పదు. తీర్చమన్న సమస్యను, కష్టాన్ని  తీర్చడంలో వారికి వారే సాటి. అందుకే రాష్ట్రం పలు మూలాలనుండి స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామిని మరియు స్వయంభూ గౌరిస్వర స్వామిని  దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు నిత్యం వస్తూనే ఉంటారు. కావలసివన్ని  అడిగి, వరాలు అంది పుచ్చుకుని సంతోషంగా తిరిగి వెళతారు. ఎవ్వరికైనా  ఆహ్వానం అన్నట్టుగా ఉంటారు ఇరువురు.