పని ఆరంభం :
ఒక సాయంత్రం దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకుని అందరమూ కలసి కూర్చున్నాము. పని విషయమై చాలాసేపు చర్చ జరిగింది. అనంతరం ఒక కొత్త విషయాన్ని ప్రస్తావన చెయ్యడం ఆరంభిచాము. మరి కొన్ని విషయాలను చర్చించాము. వాటిలో సేవ ను గూర్చి అందరం కలసి ఆలోచిస్తూ " కలసి బ్రతుకుతున్నాము, కాని కొంత సమయాన్ని మంచి విషయాలకు వెచ్చించాలని" యోజన చేసాము. మనిషిలో ఆదర్శం నింపడం కొరకు ఎదురుగా ఆవును సృష్టించాడు. మానవుడు ఎలా బ్రతకాలో తెలియ చెప్పడం కొరకు ఎన్నో ఆదర్శాలను భగవంతుడు కళ్ళకు ఎదురుగా ఉంచాడు. పెద్దలు చెప్పిన ఆవు కథ చెప్పుకున్నాము. పూర్వకాలంలో తాతగారు, మనవలు కలసి బ్రతికే అవకాసం ఉండేది. ప్రస్తుత కాలంలో ఈ అవకాసం లేదు. ఎందుకంటే పిల్లలు తమ తల్లి తండ్రులతో కలసి ఉండాలని అనుకోవటం లేదు. "బ్రతుకు వేటలో" అని వంక పెట్టి కన్నవారిని వదలి వారికి దూరంగా బ్రతకాలని అనుకోవడంలో అంతర్యాన్ని తెలుసుకోవాలి. మన కథలో ఒక తాత మనుమడు కలసి కథలు చెప్పుకుంటున్నారు. ఇంతలో ఒక ఆవు (దేశీయ) బయట "అంబా అంబా" అని ఆత్రుతతో అరుస్తూ అటువైపుగా వచ్చింది. తాత మనుమలకి కలిగిన అంతరాయానికి ఒకింత చింతించి తాత గారు మనుమనితో " అంతరాయం కలిగిస్తున్న ఆవును కొట్టి తగిలిరా" అని మనుమనికి అతని చేతిలో ఉన్న కర్రను ఇచ్చి పంపాడు. చేతి కర్ర తీసుకుని మనుమడు ఆవును చేరి కొట్టబోగా ................ (మన కథలో ఆవు మాట్లాడుతుంది........... ఎలా ? అని దయవుంచి నన్ను ప్రస్నిన్చవద్దని నా విన్నపము.) కొట్టాలని వచ్చిన బాలున్ని చూసి
ఆవు .. ఎందుకు కొడుతున్నావు ?
బాలుడు .. మా కథకు అంతరాయం కలుగాచేస్తున్నావు, అందుకు.
ఆవు .. సరే, నా ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా ?
బాలుడు .. సరే అడుగు.
ఆవు .. ఎంత చదువుతున్నావు
బాలుడు .. ఏడవ తరగతి
ఆవు .. తరువాత ఏం చేస్తావు ?
బాలుడు .. మెల్లగా పదవ తరగతి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను
ఆవు .. తరువాత ?
బాలుడు .. ఇంటర్
ఆవు .. తరువాత ?
బాలుడు .. ఇంగానీరింగ్ కాని డాక్టర్ కాని పూర్తి చేస్తాను.
ఆవు .. తరువాత ?
బాలుడు .. మంచి ఉద్యోగం సంపాదిస్తాను
ఆవు .. తరువాత ?
బాలుడు .. బాగా డబ్బులు సంపాదిస్తాను. పెద్ద ఇల్లు కట్టుకుంటాను, పెద్ద కారు కొంటాను.
ఆవు .. తరువాత ?
బాలుడు .. మంచి, అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను
ఆవు .. తరువాత ?
బాలుడు .. ఇంకేంటి, పిల్లలకు తండ్రిని అవుతాను.
ఆవు .. తరువాత ?
బాలుడు .. వారిని పెద్ద చేసి, చదివించి, వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్లు చేస్తాను.
ఆవు .. తరువాత ?
బాలుడు .. వారికి పెళ్ళిళ్ళు చేస్తాను
ఆవు .. తరువాత ?
బాలుడు .. వారికి పిల్లలు పుడతారు. నేను పదవీ విరమణ చేస్తాను. ఆ పిల్లలతో ఆడుకుంటాను. కొంతకాలానికి నేను ముసలి అయిపోతాను.
ఆవు .. తరువాత ?
బాలుడు .. ఇంకేముంది ? ఒక రోజు చచ్చిపోతాను.
ఆవు .. ఓస్ ...... ఇంతేనా ?????????????
(మన వాడికి కోపం వచ్చింది. వెంటనే మనవాడు ఉద్రేకంగా.....)
బాలుడు .. ఇంతకి నువ్వు ఏం చేస్తావు ? (ఎదురు ప్రశ్న )
ఆవు ... నేను ఈ సమాజానికి పనికిరాని గడ్డి తింటాను.
బాలుడు .. (చిన్నగా నవ్వుతూ) తరువాత ?
ఆవు .. ఈ సమాజం దృడంగా, బలంగా, శక్తివంతంగా ఉండాలి. అందుకు పాలు ఇస్తాను.
బాలుడు .. తరువాత ?
ఆవు .. ఈ సమాజం అందంగా, ఆరోగ్యవంతంగా ఉండాలి. అందుకు వెన్న, మీగడ ఇస్తాను.
బాలుడు .. తరువాత ?
ఆవు .. ఈ సమాజం గ్యానవంతం గా ఉండాలని నెయ్య ఇస్తాను.
బాలుడు .. తరువాత ?
ఆవు ... నేను కుడా పిల్లలను ఇస్తాను. అవి ఆడవైతే నేను చేసిన పనినే జీవితాంతం అవి చేస్తూనే ఉంటాయి. మగవైతే రకరకాల బరువులు లాగడానికి, వ్యసాయపు పనులలోను ఉపయోగ పడుతున్నది.
బాలుడు .. తరువాత ?
ఆవు ... పేడతో చాలా గ్రామాలలో కరంటు తయారు చేసుకుంటున్నారు. పంచగవ్యములు పలు రకముల వ్యాధులకు ఔశధములుగా ఉపయోగపడుతున్నాయి.
బాలుడు .. తరువాత ?
ఆవు .. నేను కూడా చనిపోతాను. కాని నీ కాలుకు చెప్పులు వేసుకున్నావు కదా. అవి నా తోలుతో తయారు చేసినవి. నా కొమ్ములతో పిల్లలు ఆడుకొనే బొమ్మలు తయారు చేస్తారు నువ్వు వాడుతున్న పంచదార నా ఎముకల గుండతో శుద్ధి చేస్తారు. నేను చనిపోయిన తరువాత నన్ను ఎరువుగా కుడా వాడుకోవచ్చు.
ఇన్ని ఉపయోగాలున్న ఆవును భారతీయులు ఆరాధ్య దైవంగా పూజ చేస్తారు. మరి మనిషి సమాజహితం కొరకు చేస్తున్నది ? తన స్వార్ధం కొరకు ప్రపంచాన్ని గుప్పిట పట్టాలని చూస్తున్నాడు .
మరి మనవాళ్ళు "మనిషివా పసువువా ?" అని ప్రశ్నిస్తూ వుంటారు. ఏమని ప్రస్నిన్చాలంటారు ? " పశువువా లేక మనిషివిరా ?" అని కదా.......
ఇది విన్న తరువాత చాలా మంది మిత్రులు అలోచించి ఏదయినా చెయ్యాలని సంకల్పం చేసారు.
ఈ విధంగా పని ఆరంభం కావడం చాలా ఆనందించ వలసిన విషయం కదా ....