వినాయక చవితి శుభాకాంక్షలు
వినాయక చవితి శుభాకాంక్షలు
అందరకు వినాయక చవితి శుభాకాంక్షలు. రాబోయే వినాయక చవితికి అందరూ వినాయక పూజ చేసి భగవంతును ఆశీస్సులు పొందగలరని ఆసిస్తున్నాను. గణపతి మన అందరిపై తన కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరింప చేస్తాడని కోరుకున్దాము. వినాయక చవితి అంటేనే పిల్లలకు సంతోష దాయకమైన పండుగ. పిల్లలకు చవితి ప్రాధాన్యాన్ని, గొప్పతనాన్ని తెలుప వలసిన బాద్యత పెద్దలపై ఎంతైనా ఉన్నది. కొంచెంగా స్మరిద్దాము.
పర్వత రాజు కుమార్తె పార్వతి. పర్వము అంటే పండగ. ఉత్సవము. తద్వారా లభించేది సంతోషము అందు నుండి ఆవిర్బవించినది పార్వతి. ఆనందానికి మూలము మనలో ఉన్న మలినాలను విడిచిపెట్టడము. 'వాటిని విడిచిన పార్వతి మరలాల్ వాటిపై మమకారాన్ని పెంచుకున్నది. వాటిని విడవాలి అంటే నిరాడంబరత కావాలి. అదే శివ తత్వమ్. శివుడు వాటిని తన త్రిశూలం (త్రిగుణాలు సత్వము, రజస్సు, తమస్సు ప్రతి వ్యక్తీ లో ఉండేవే) తో సమ్హరించాడు.
నాయకత్వం :
మమకారమ కారణం గా ఆ బొమ్మను మరల ఏనుగు తుండం ముఖంతో (అంటే గ్యానా శక్త్రి, క్రియా శక్తి ఒకటిగా గల తుండం ) జోడించి ప్రాణం పొసాడు. ఎవరికైతే రెండు శక్తులు ఒకటిగా ఉంటాయో వారు నాయకులు అవుతారు. అందుకే వినాయకుడైనాడు.
గణాధిపతి పదవికి పోటీ వచ్చినపుడు వినాయకుడు తల్లి తండ్రులకు మూడు మారులు ప్రదక్షిణ చెసాడు. అంటే తల్లి తండ్రుల పాదాల చెంత మాత్రమె సర్వ తీర్తాలు, సర్వ క్షేత్రాలు కొలువుంటాయని తెలియ జేస్తున్నాడు. ఎవరైనా నాయకుడుగా ఎదగాలి అంటే ముందుగా తల్లి తండ్రులను గౌరవించగలిగితే నాయకుడు తప్పక కాగలదు. (చరిత్రలో శ్రావణ కుమారుడు, రాముడు ఇలా ఎంతో మంది) యువకులు అందరూ నాయకులు కాగలరు. కాని నిస్వార్ధ నిరాడంబర నాయకులు. నేటి నాయకులు కాదు (90 శాతం నాయకుల స్తితి మనకు తెలుసు).
శక్తి మరియు నిరోగత :
ప్రపంచంలో గల జీవులలో శక్తి వంతమైన జీవి ఏనుగు. సింహం కూడా వెనుకనుంచి వార్ చేస్తున్ది ఏనుగును. ఎలా సాధ్యమ్. శాఖాహారము ద్వార. 21 రకాల పత్రులను చవితి పరిచయం చేస్తున్ది.
తులసి : 300 రకాల శారీరక రుగ్మతలకు దివ్య ఔషదము.అంటే కాకుండా 24 గంటలు
వాయువును ప్రసాదించే అద్భుత మొక్క
రావి : సంతానోత్పత్తికి
మర్రి : దీర్గాయువుకు
జామ : హృదయ రోగాలకు
అశోక : స్త్రీ సంబంధిత సమస్యలకు
ఉసిరిక : ఆయుర్వేదం "కరతలామాలిక" అని చెపుతున్ది. అంటే చేతిలో ఉంటే అరొగ్యమే.
మారేడు : బిల్వ దళం శివునికి చాలా ప్రీత పాత్రమైనది. ఎందుకంటే శివుని నివాసం స్మశానము.
రాసుకునేది బూదిద. కంఠమ్ లో గరళం, వీటన్నిటికి అంటే ఎలాంటి విషాన్నయినా
హరించగల శక్తి గల్గినది మారేడు.
మామిడి : చెట్టు నుండి విడివడిన 3 రోజుల వరకు తన శ్వాసను కొనసాగిస్తున్ది. వాతావనాన్ని
శుద్ధి చేస్తున్ది. మామిడి తోరణాలు కట్టేది అన్దుకే.
ఇలా ప్రతి పత్రీ నిత్య జీవితలో పనికివచ్చే ఔషధమే. పరిపూర్న ఆరోగ్యం కొరకు ప్రక్రుతిని పరిచయం చెయ్యడమే వినాయక చవితి. అంతే కాకుండా
శాకాహారము యొక్క పరిచయము
ఏనుగు శాకాహారి. ప్రపంచంలో అతి శక్తివంతమైన జీవి. (శారీరక మానసిక పరంగా). మనకు తెలుసు. సింహం అడవికి రాజుగా ప్రకటించుకుంటున్ది. జంతువులూ సమావేశమై రోజుకు ఒక జంతువు గా నిర్ణయిస్తాయి. కుందేలు వంతు వస్తున్ది. సింహాన్ని చమ్పేస్తున్ది. శాకాహారాన్ని అందులో ఉన్న శక్తిని పరిచయం చేయాలి.
నదుల శుద్ధీకరణ :
ఔషధ గుణాలు కలిగిన పత్రులన్నీ నదిలో కలపడం ద్వారా నదిలో చేరిన కొత్త నీటిని శుద్ధి చేసి ప్రజల ఆరోగ్యాని రక్షిస్తాము.
ప్రస్తుత పరిస్తితులలో ముఖ ప్రితికి తప్ప ఆచరణ దాయకం గా, గ్యానదాయకంగా చవితి జరగటము లేదు. సావర్కర్, తిలక్ లాంటి వారు సామూహిక, సమాజ శక్తి జాగృతి కొరకు సాముహిక గనేష ఉత్సవాలను ప్రొత్సహించారు. కాని నేటి దృశ్యం వేరుగా ఉన్నది. కులానికి, వర్గానికి వినాయకుడు పరిమితమైపొయాడు. ఈ స్తితి మారాలి. అందుకు మనమ0దరమూ కలసి పనిచేయ్యల్సిన అవసరం ఉన్నది. యువతరం బాధ్యత తీసుకున్నా, విలాసాల పండుగగా చవితి మారింది. ప్రస్తుత స్తితి మారేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.
No comments:
Post a Comment