మన పెద్దలు మనకి మార్గ దర్శనం చేసారు. కాని మన జాతి దానిని మరచిందేమో అనిపిస్తూ ఉంటుంది. చిన్న చిన్న కధల ద్వారా ఎంతో చక్కనైన ఉదాహరణల ద్వారా జీవిత సత్యాలను మన ముందు
ఆవిష్కరించారు. మనందరికి తెలుసున్న సత్యమునే ఒక సారి నెమరు వేసుకుందాము. ప్రస్తుతం మానవుని యొక్క నైజమును చక్కగా ఆవిష్కరించారు. కత కథ చెప్పుకుందామా ?
ఒక రాజు గారు. వారికి ఏడుగురు కొడుకులు. ఒకపరి ఏడుగురు కొడుకులు వేటకు వెళ్ళారు.
ఏడుగురు కొడుకులు ఏడు చేపలు తెచ్చారు. వాటిని ఎండ పెట్టారు.
ఏమే చేపా ఎండలేదు ?
గడ్డిమేటు అడ్డు వచ్చింది.
ఏమే గడ్డి మేటు అడ్డు వచ్చావు ?
ఆవు మేయ లేదు.
ఏమే ఆవు మేయ లేదు ?
పాలి గాడు విప్పలేదు.
ఏమిరా పాలిగా విప్పలేదు ?
అవ్వ బువ్వ పెట్ట లేదు.
ఇలా కథ సాగుతుంది. ఇంత వరకు ప్రతి ఒక్కరు తమ కర్తవ్యాన్ని ప్రక్కవారిపై త్రోసి, తమ బాద్యతను విస్మరించడం చూస్తాము. ఈ రోజు సమాజం లో చూస్తున్నది, జరుగుతున్నది ఇదే కదా.
ఇలా ప్రతి ఒక్కరు తమ బాద్యతను మరచి, నేను మనిషిని అనే విషయాన్ని కుడా సమాజం మరచిపోయిందేమో అనిపిస్తూ ఉంటుంది. ప్రతి వారు ప్రక్క వారి వైపు వేలు చూపిస్తున్నారు తప్ప తమ బాద్యతను విస్మరించి ప్రవర్తిస్తున్నారు అనేది సత్యం.
కథ లోనికి మరల వెళితే .......
ఏమే అవ్వా ఎందుకు పెట్టలేదు ?
పిల్లాడు ఏడుస్తున్నాడు.
చీమ కుట్టింది.....
ఏమే చీమ ఎందుకు కుట్టావు ?
నా బంగారపు పుట్టలో వేలు పెడితే కుట్టనా ? ( అని అడిగింది )
అది బంగారపు పుట్టా ?
"నేను చావనైనా చస్తాను కాని నా పుట్టలో వేలు పెట్టిన వాడిని వదలను" అని అతి చిన్నచీమ అనగలిగితే దానికి గల ఆత్మా విశ్వాసం ను గూర్చి ఏమనాలి ?
అతి చిన్న చీమకు అంత ఆత్మ విశ్వాసం ఉంటె మనిషిగా మనకు ఎంత ఉండాలి ?
సంస్కృతి, సాంప్రదాయాలు, గ్రామం, కుటుంబ వ్యవస్థ, నైతిక విలువలు, ఆత్మీయత, అభిమానం, చివరిగా అన్ని కోణాలలో దేశం నాసనమవుతూ ఉంటె నాకెందుకులే అని, నా చిన్ని పొట్టకు శ్రీ రామ రక్ష అని నిమ్మకు నీరెత్తినట్లు, ఏమి పట్టకుండా, ధనార్జన కొరకు స్వీయ సంతోషాల కొరకు వెంపర్లాడే వారిని ఏమనాలి ?
భారతం ఎన్నింటిలో ప్రధమ స్తానంలో ఉన్నదో తెలుసా ?
01. మధు మెహ వ్యాధి తో ముందు స్తానం లో ఉన్నది.
02. హృదయ రోగాల తో ముందు స్తానం లో ఉన్నది.
03. రక్త పోతూ (బి.పి) తో ముందు స్తానం లో ఉన్నది.
04. ఎయిడ్స్ తో ముందు స్తానంలో ఉన్నది. ఇవి కాక
05. అవినీతి లో ముందు స్తానం
06. అక్రమాలలో ముందు స్తానం
07. సంపన్న దేశం అయి కూడా పేదరికంలో మంచి స్తానం ఉన్నది
అన్నిటికన్నా ముక్యమైన విషయం
08. ప్రపంచం మొత్తం మీద 8,00,000 ( 8 లక్షలు ) మంది ఆడపిల్లలు వ్యభిచార గృహాలకు అమ్ముడవుతు ఉంటె భారత దేశంలో ఒక్క ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం నుండే 1,00,000 ( లక్ష ) మంది ఆడపిల్లలు అమ్ముదవుతున్నారు అనేది నగ్న సత్యం ( వనితా టి.వి. చానల్ ద్వారా ప్రసారమయింది )
ఇంత జరుగుతున్నా నాకెందుకులే అని ప్రవర్తిస్తున్న వారిని ఏమనాలి ?
ప్రజలు చాలా మంచి వారు. తప్పు వారిది కాదు.
ప్రభుత్వాల తీరు అలా ఉన్నపుడు ప్రజలు చెయ్యగలిగినది మాత్రం ఏమిటి ?
దేశంలో 3 రంగాలవారు ప్రజలను దోచుకుంటున్నారు అనేది నిజం.
01. నాయకులు లేదా పాలకులు
02. అధికారులు ( పై స్తాయి వారు )
03. పోలీసులు
అందరు దుర్మార్గులు అని అనలేము కాని 80% మంది మాత్రం వారే.....
01. పాలకులు వారికి కావలసిన చట్టాలను చట్ట సభలలో
వారికి అనుగుణంగా, వారికి ఉపయోగ పడేలా చేసుకుంటారు.
( అవి పరజలకు ఎవ్విధంగాను ఉపయుక్తం కావు )
02. పైస్తాయి అధికార గానం సదరు చట్టాలను అమలు చేసి ప్రజలపై
రుద్దు తారు. తద్వారా నాయకులకు, పెట్టుబడి దారులకు ఉపయోగ
పడేలా కఠిన చర్యలు తీసుకోవడమే వారు చెయ్యగలిగినది. అదే
చేస్తారు.
03. ఇక పోలీసులు సదరు చట్టాల అమలుకు, అధికారుల ఉత్తర్వులను
తూచా తప్పకుండ తమ లాఠీలను ప్రయోగించి, ప్రజలను చితక బాది,
అవసరమైతే ప్రజల ప్రాణాలను తీసి పాలకులకు, అధికారులకు
సహాయం చేస్తున్నారు అనేది సత్యం, నిజం.
ఇంత జరుగుతూ ఉంటె ఇది స్వతంత్ర భారత దేశమేనా అనే అనుమానం కలుగాదంటారా ?
మరి మనం చెయ్యవలసినది ఏం లేదా ?
" సంఘే శక్తి కలౌ యుగే " అనికదా ధర్మం చెపుతున్నది.
అందుకే ఈ కార్యం ................................
చీమే ఆదర్శం ....... కాదంటారా ..............................