Tuesday, January 29, 2013

మన నాయకులు :




 దేశంలో కొట్లలో  సంపద  ఉండవచ్చు, లక్షలలో చట్టాలు ఉండవచ్చు. కాని ఆ సొమ్మును ఖర్చు చేసేవాడు, సదరు చట్టాలను అమలు పరిచేవాడు నిజాయితీ పరుడు, నిబద్ధత కలిగినవాడు కావాలి. అప్పుడే క్రింద స్తాయి వారికి కూడా ఫలాలు అందుతాయి .
                             ...... స్వామీ వివేకానంద 

నీచ్, కమీన్, కుత్తే లు ఎవరు ? "అనేది వంద డాలర్ల ప్రశ్న. విదేసీయులా, మనవాడనుకున్నవాడా ? 

నేడు మనం చూస్తున్నాము. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన నాయకులలో 90 శాతం మంది దోపిడిదారులే. కాదనగల ధైర్యం ఎవరికి  ఉన్నది ?

ధీరోదాత్త వ్యక్తిత్వం లాల్ బహదూర్ శాస్త్రి గారిది. పొరుగుదేశం తో యుద్దం లో స్వయంగా యుద్ధ భూమిలో నిలబడి సైనికులను ఉత్సాహ పరచి, సైనికులతో పాటు కాలు కాలు కలిపి దేశానికి విజయాన్ని చేకూర్చి పెట్టిన మహోదాత్త వ్యక్తిత్వం వారిది.  ఇదంతా అందరికి తెలుసున్నదే. కాబట్టి నేను విషయాన్ని మీ ముందు ఏకరువు  పెట్టదలుచుకోలేదు

అయినప్పటికీ ప్రస్తుతం దేశానికి నాయకులు, నిజమైన నాయకులు, నిస్వార్ధ బుద్దితో పనిచేసే నాయకులు కావాలి అనేది సత్యం.

బ్రిటిష్ వారు మనలను 200 సంవత్సరాలు బానిసలుగా చేసుకొని  పరిపాలించారు. 200 సంవత్సరాలలో తెల్లవాడు నాదైన భారతదేశం నుండి దోచుకున్నది లక్ష కోట్లు. (అన్ని రూపాలలొ)

అంత క్రితం సగటు భారతీయుని పరిపాలించినది ముస్లిం పాలకులు. దోచుకోవడానికి వచ్చినవారు గజని, గోరి విఫల ప్రయత్నం చేసి కావలసినంత దోచుకుని  (ధన, ప్రాణ, మానాలు) అలిసిపోయి ఈ దేశంలోనే స్తిరనివాసం ఏర్పరచుకున్నారు. 800 సంవత్సరాలు దోచుకున్నారు అన్నిరకాలుగా

అతి కష్టం వలన సుదీర్గ పోరాటాల ఫలితంగా 1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్యం వచ్చింది అనిపించుకున్నాము . కాని వచ్చిందా  ? ఇప్పటికి అనుమానమే ..

నిజంగా స్వాతంత్ర్యం వచ్చింది అని ఎవరైనా అంటే ఆశ్చర్యపోక తప్పదు. 
ఎందుకంటే స్వాతంత్ర్యం వచ్చి గడచినా 65 సంవత్సరాలలో మన అన్నవాడు మనలనుండి  84 లక్షల కోట్లు దోచుకున్నాడు అన్న సత్యం బాధను కలిగించక మానదు. ఇది అంచనా విలివ మాత్రమె. దోచినది ఎంతో ఇంకా తెలియాల్సి ఉంది. 84 లక్షల కోట్లు అనుకున్న సంవత్సరానికి 1 లక్ష కోట్లన్నమటె కదా ....... అంటే బ్రిటిష్ వాడు 200 సంవత్సరాలలో బ్రిటిష్ వాడు దోచుకున్నది, మన అన్న వాడు 1 సంవత్సర కాలంలో దోచుకున్నాడు. 

స్విష్  ఖాతాలలో మూలుగుతున్న సొమ్ము తో దేశంలో ప్రతి పౌరుడు హుందాగా బ్రతికేందుకు అవకాసం ఉంది. కాని మన పాలకులు అది కోరుకొంటున్నారా లేదా అనేది మన అందరికి తెలుసు. 

ఇంతకీ " నీచ్, కమీన్, కుత్తే లు ఎవరు ? "అనేది వంద డాలర్ల ప్రశ్న. విదేసీయులా, మనవాడనుకున్న వాడా ?  
ఈ సందర్భంలో స్వామీ వివేకానంద మదిలో మెదలక మానరు

"నా దేశంలో ఒక కుక్క పిల్ల కూడా ఆకలితో చనిపోకూడదు"    అని 

కన్నీటి పర్యంతం పర్యంతం అయిన స్వామీ కి మనం అరిపిస్తున్న నివాళులు బాగున్నాయా ?  అందుకే యువకులను ఎకత్రితం చెయ్యాలని  అనిపించింది. వారిని ఉత్తేజ పరచాలని అనిపించింది. 

జీవశ్చవాలుగా, స్వార్ధ పూరితంగా, స్వంతలాభం కొరకు ఉద్యోగం, ధనార్జన, నేను, నా ఇల్లు,  అని బ్రతుకుతున్న యువతను స్వామీ మార్గంలోనికి, దేశ  హితం కొరకు తీసుకురావాలని అనిపించింది. వారిని నిస్వార్ధ పూరిత నాయకులుగా తయారుచెయ్యాలని అనిపించింది. కనీసం వారిలో వారి గ్రామం పట్ల శ్రద, భక్తీ, ఆరాధన  నింపాలని అనిపించింది. కనీసం గ్రామ స్తాయిలో నాయకులుగా తయారు చేయాలని అనిపించింది. 

కొత్త నాయకుల కొరకు అందరమూ పని చేద్దాము. దయవుంఛి ఎదురు చూడవద్దు

స్వామీ వివేకానంద ఆశయ సాధనలో నడుం బిగిద్దాము.....  రండి, చేతులు కలుపుదాం ..........